astrology

జ్యోతిష శాస్త్ర ప్రకారం జులై 31 నుంచి  గురుడు ,శుక్రుడ కలయిక వల్ల ఈ మూడు రాశులు వారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి:  ఈ రాశి వారికి వాణిజ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో మీరు ఊహించని లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్లో మీకు లాభాలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెంచే ఒక పెద్ద ఒప్పందం పొందుతారు. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త పనిని లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారు నిరభ్యంతరంగా ప్రారంభవించవచ్చు. మీకు లాయబాదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. విద్యార్థులు ప్రాజెక్టు పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎప్పటినుంచో బాధపడుతున్న కొన్ని పాత వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు పూర్తవుతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి సానుకూల ప్రభావం ఉంటుంది. ఉద్యోగస్తులు తమపై అధికారుల నుండి మద్దతు పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. పెద్ద కంపెనీల్లో షేర్లు చేయడం ద్వారా మీకు లాభదాయకంగా ఉంటుంది. విదేశీయానం ఉంటుంది. విద్యార్థులు భవిష్యత్త లో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్త ప్రయాణాలు చేస్తారు వ్యాపారానికి సంబంధించి సానుకూల సమయం. కుటుంబంలో ఎప్పటినుంచో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.

Health Tips: చలికాలంలో కూడా పెరుగన్నం తినడం ఆరోగ్యానికి మంచిదేనా ...

తులారాశి:  గురు శుక్ర గ్రహాల కదలిక వల్ల ఈ తులా రాశికి చాలా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. ఎప్పటినుంచో సొంత ఇల్లు కొనాలనే కళ నెరవేరుతుంది. ఆకస్మికంగా ధన లాభం పెరిగే అవకాశం ఉంది. మీ వ్యాపారాలు విస్తరించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. జీవిత భాగస్వామితో విదేశీ యానం చేసే అవకాశాలు ఉన్నాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.