astrology

ఆగస్టు 2వ తారీఖు రాత్రి 10 గంటలకు సూర్య గ్రహం పుష్య నక్షత్రాన్ని వదిలి ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది. ఇలా ప్రవేశించడం ద్వారా ఈ మూడు రాశుల వారికి అద్భుత ఫలితాలు లభిస్తాయి. ఆ రాశి ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఆగస్టు 2 నుండి ఏలినాటి శని వదిలిపోయి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు తమ కెరీర్లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి సువర్ణ అవకాశం లభిస్తుంది. ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారం కోసం పర్యటనలు చేయవలసి వస్తుంది. రాజకీయ నాయకులకు సంబంధించిన సామాజిక ప్రతిష్ట సంఘంలో పెరుగుతుంది.

మీన రాశి:  ఎప్పటినుంచో మానసికంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొంది నూతన ఉత్సాహంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. కళా రంగానికి చెందిన వారికి అద్భుతంగా ఉంటుంది. మీ సృజనాత్మక పెరుగుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు అందుతాయి. కలలు సాహిత్య రంగంలో ఉన్న వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీ సామర్థ్యాలు పెరిగి ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. భాగస్వామ్య వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

Health Tips: చలికాలంలో కూడా పెరుగన్నం తినడం ఆరోగ్యానికి మంచిదేనా ...

కర్కాటక రాశి:  ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. పూజా కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొంటారు.  మిత్రులతో సంబంధాలు బలపడతాయి. వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు విదేశీ అన్న అవకాశం ఉంది మానసికంగా దృఢంగా ఉంటారు మొండి బకాయిలు వసూలు అవుతాయి. నూతనంగా వాహనాల కొనే అవకాశం ఉంది. వ్యాపారానికి పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.