జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది అయితే జులై 31న శుక్రుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అద్భుత రాజయోగం ఏర్పడుతుంది. జులై 31 చాలా శుభప్రదం ఈ రోజున శుక్రుడు సింహరాశిలోకి వెళ్తాడు. తర్వాత ఆగస్టు 11న పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. ఈ 24 రోజులు కూడా ఈ మూడు రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.ఈ 12 రాశుల లో మూడు రాశులు సంతోషంతో పాటు ఆర్థిక లాభాలు కూడా పొందుతాయి. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందా

మిథున రాశి:  ఈ రాశి వారికి రాబోయే రోజులు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. శుక్రుని రాశి మార్పు కారణంగా వీరికి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. వీరిలో ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. లక్ష్మీనారాయణ యోగం మీకు అన్ని విధాలుగా శుభప్రదం. విద్యార్థులకు భవిష్యత్తు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఆనందంగా ఉంటారు.

మేష రాశి:  ఈ రాశి వారికి శుక్ర గ్రహం మార్పు కారణంగా అద్భుత ఫలితాలు లభిస్తాయి. వీరికి లక్ష్మీనారాయణ యోగం కృప వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారంలో మీ ఆర్థిక లాభాలు పొందుతారు. మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు చేసే పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు శుభకార్యాలు కూడా జరుగుతాయి. చేపట్టిన వ్యాపార రంగంలో ధన లాభం ఉంటుంది. రాబోయే 24 రోజులు మీకు చాలా శుభకరం ప్రేమ వివాహాలకు అనుకూలం కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి శుక్రుని రాసి మార్పు కారణంగా అన్ని శుభాలే జరుగుతాయి. వ్యాపార రంగంలో మీరే పై చేయిగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. రాబోయే రోజులు మీకు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా గడుపుతారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. మీ వ్యాపార రంగాన్ని విస్తరించేందుకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.