దానం చేయడం అనేది చాలా శుభకార్యంగా పరిగణిస్తారు. దీని ద్వారా వారి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే దానధర్మాలు చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని మన గ్రంధాలలో తెలిపారు. ఎందుకంటే కొన్ని వస్తువులు దానం చేయడం ద్వారా జన్మజన్మల పాపాలు అంటుకుంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానం చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. కొన్ని వస్తువులు దానం చేయకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కత్తెర ,కత్తులు : కత్తులు సూదులు కత్తెరలు వంటి పదునైన వస్తువులు కూడా వస్తువులు ఎప్పుడు కూడా దానం చేయకూడదు. ఇవి దానం చేయడం ద్వారా మీకు ఏలినాటి శని పడుతుంది. అంతేకాకుండా మీ ఇంట్లో గొడవలు అవుతాయి. తీసుకున్న వారికి మీకు మధ్యన అపార్ధాలు చోటు చేసుకుంటాయి.
Astrology: ఆగస్టు 25 నుంచి శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం.
స్టీలు పాత్రలు: చాలామంది పాతగా అయిపోయిన స్త్రీలు పాత్రలను దానం చేస్తూ ఉంటారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేయకూడదు. ఇవి దానం చేయడం ద్వారా మీ ఇంట్లో నుంచి ఐశ్వర్యము ఆనందము దూరమవుతాయి. అంతేకాకుండా మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీ వ్యాపారంలో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి ఎవరికీ కూడా స్టీల్ పాత్రలు దానం చేయకండి
పాచిపోయిన అన్నాన్ని ఇవ్వద్దు: చాలామంది పాడైపోయిన అన్నాన్ని పేదవారికి బిక్షగాళ్లకు దానం చేస్తూ ఉంటారు. ఇది చాలా పాపకార్యం మీరు ఎవరికన్నా దానం చేయాలనుకుంటే ఎల్లప్పుడూ కూడా మంచి ఆహారాన్ని మాత్రమే దానం చేయాలి. ఇలా చేసినట్లయితే మీరు జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది.
చీపురు దానం చేయవద్దు: చీపును అందరూ లక్ష్మీదేవితో పోలుస్తారు. అందుకే చీపురును ఎప్పుడూ కూడా దానం చేయకండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు వస్తాయి. అంతేకాకుండా చీపురును దానం చేయడం వల్ల ఆ ఇంట్లో గొడవలు మనస్పర్ధలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ కూడా వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా చీపురును దానం చేయవద్దు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.