జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం తన రాశిని మార్చుకునే విధానంలో కొన్నిసార్లు తిరోగమనం కూడా  ఉంటుంది. కొన్నిసార్లు గ్రహాల తిరోగమనము చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. గురు గ్రహం సెప్టెంబర్ 18 నుండి తీరుగమనం వైపు వెళుతుంది. దీని కారణంగా మూడు రాశుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీన రాశి- ఈ రాశి వారికి గురుడు తిరోగమన కదలిక వల్ల సానుకూల ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాపారంలో అపారమైన సంపదను సంపాదిస్తారు. మీరు పని చేసే చోట గౌరవం పెరుగుతుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన ఆస్తిని కొనుగోలు చేస్తారు. విదేశాల్లో పెట్టుబడులు పెడతారు.

వృశ్చిక రాశి- ఈ రాశి వారికి గురుడి తిరోగమన కదలిక వల్ల ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు. రావాల్సిన మొండిబకాయలను తిరిగి పొందుతారు. వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు పెరుగుతాయి.ముందుకు దూసుకు వెళ్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఇచ్చే ఆర్డర్లు వస్తాయి. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.

Astrology: మల్లికార్జున స్వామికి ఇష్టమైన 4 రాశులు ఇవే

తులారాశి- ఈ రాశి వారికి కోరుకున్న కలలు నెరవేరుతాయి. విద్యార్థులు కెరీర్ లో ఉన్నత స్థానానికి వెళతారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దీని వల్ల మానసికంగా మెరుగుపడతారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది మీరు కోరుకున్న కలలు నెరవేరుతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.