లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో సిరిసంపదలు నిండి ఉంటాయి. ఐశ్వర్యానికి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉంటుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ప్రజలు అనేక రకాలైన పూజలు చేస్తారు. మీ ఇంట్లో ప్రతిరోజు లక్ష్మీదేవికి పూజ చేస్తారు. అయితే ఆ తల్లి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలంటే ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండడం మంచిది. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీ యంత్రం: మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా స్థిర నివాసం చేయాలి అంటే మీ ఇంట్లో శ్రీ ఎంత అన్ని ఉంచుకోవడం చాలా మంచిది. శ్రీ యంత్రాన్ని పెట్టి ప్రతి రోజు దానికి పూజించడం ద్వారా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది. ఈశాన్యం మూలలో ఈ శ్రీ యంత్రాన్ని ఉంచితే అదృష్టం కలిసి వస్తుంది.
శంఖం: శంఖం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది శంఖాన్ని మీ ఇంట్లో పూజ గదిలో ఉంచితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ పొందుతారు.
లక్ష్మీ గవ్వలు: లక్ష్మీదేవికి గవ్వలంటే ఎంతో ఇష్టం శుక్రవారం నాడు ఆ లక్ష్మీదేవిని పూజించే 21 గవ్వలను సమర్పించండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర ఈ గవ్వలను ఉంచితే మీ ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయి. అంతేకాకుండా మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. భార్య భర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.
Astrology: మల్లికార్జున స్వామికి ఇష్టమైన 4 రాశులు ఇవే
తామర పువ్వు: లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పువ్వు తామర పువ్వు. ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత ఆమె పాదాల వద్ద తామర పువ్వును పెట్టినట్లయితే మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ ఉండవు. మీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది.
ఆవు నెయ్యితో దీపం: ఎల్లప్పుడు కూడా మీ పూజ గదిలో లక్ష్మీదేవి దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం పూట లక్ష్మీదేవి దగ్గర లేదా తులసి కోట దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించడం ఎంతో శుభకరం. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండే ఆనందం ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.