జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ఆగస్టు 15న ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల అన్ని రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం, అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయి. 30 రోజుల్లో వీరు ధనవంతులవుతారు. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీన రాశి: ఆగస్టు 15న సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక రంగాల్లో విజయాలు పొందుతారు. జీవితంలో వచ్చే అనేక రకాల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వీరికి డబ్బుకు ఎటువంటి కొదవ ఉండదు. కొత్త వాహనాలు ఇల్లు కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు ప్రయాణిస్తారు.
Astrology: ఆగస్టు 25 నుంచి శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం.
మేష రాశి: ఈ రాశి వారికి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశం వల్ల అదృష్టం ఉంటుంది. వీరికి పూజా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఉన్నత అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. దీనివల్ల మీరు పదోన్నతి పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులు భవిష్యత్తు బాగుంటుంది. విదేశీ ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు.
కర్కాటక రాశి: సూర్యుని రాశి చక్రం మార్పు వల్ల కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి ఉద్యోగాల్లో పురోగతి పొందే అవకాశం ఏర్పడుతుంది. మీరు భూమిని కొనుగోలు చేస్తారు. నూతన వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు ఇంట్లో శుభకార్యాలు అయ్యే అవకాశం ఉంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.