జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు బలమైన గ్రహం. ఈ గ్రహం కదలిక వల్ల కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈసారి ఆగస్టు 19వ తేదీన కుజుడు మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశం. దీని కారణంగా ఐదు రాశుల వారికి సుమారు 15 రోజుల పాటు కష్టంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి: ఈ రాశి వారికి కుజుడి రాశి మార్పు కారణంగా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. మీరు ఎక్కడైనా పెట్టుబడిన పెట్టుబడి తిరిగి రాదు. కాబట్టి పెట్టుబడులు పెట్టడం మానుకోండి. లేకపోతే తీవ్ర నష్టాలు సంభవిస్తాయి. కోర్టు కేసులు కారణంగా మీరు ఆర్థికంగా నష్టపోతారు. వ్యాపారవేత్త వ్యాపారంలో నష్టాల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతాడు. మీ కుటుంబ సమస్యలు పెరుగుతాయి. అనవసర విషయాల్లో జోక్యం వల్ల మీకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులకు కాస్త గడ్డుకాలం దూర ప్రయాణాలకు వెళ్ళకండి.
కన్యా రాశి: ఈ రాశి వారికి వ్యాపారంలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా కొంచెం నష్టపోవాల్సి వస్తుంది. ఎటువంటి నిర్ణయం తీసుకున్న ఆచితూచి తీసుకోండి. లేకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మీ పై అధికారుల నుండి ఉద్యోగంలో ఒత్తిడి గురవుతారు. రాజీ పడే విషయాల్లో తీవ్ర నిరాశకు గురవుతారు. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య మళ్ళీ తీవ్రతరం అవుతుంది. దూర ప్రయాణాలకు వెళ్లే అవకాశం వస్తే మానుకోండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
మేషరాశి: ప్రేమ వివాహాలకు కోస్తా గడ్డుకాలం తొందరగాపడి పెళ్ళికి ఓకే అని చెప్పకండి ఎందుకంటే జీవితకాలం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు అనువైన సమయం కాదు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరుగుతాయి. దీని వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఒక పెద్ద ప్రాజెక్టు పరంగా వ్యాపారవేత్త చేత నుండి మోసపోతారు. మీరు పని చేసే చోట మీ సహోదయోగితో గొడవ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Astrology: ఆగస్టు 17 శని త్రయోదశి, ప్రీతియోగం కలయిక
వృశ్చిక రాశి: ఈ రాశి వారిని నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా నష్టపోయే అవకాశంలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఏ పని చేపట్టిన అది పూర్తికాదు. దీనివల్ల మీరు ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగస్తులు మీ ఆఫీస్ పని కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. దీని ద్వారా మీకు తలనొప్పి తిరిగే అవకాశం ఉంది. లావేదవిల విషయాల్లో తొందరపడకండి. ఎందుకంటే మీ సన్నిహితుల్ని మీకు ద్రోహం చేస్తారు. కోర్టు సంబంధ విషయాల వల్ల నష్టపోతారు.
కుంభరాశి: ఈ రాశి వారికి వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఖర్చులు పెరుగుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. పని చేస్తే చోట ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు తమ కోరుకున్న రంగంలో సీటు లభించదు. నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని ఆలోచన ఉంటే విరమించుకుంటే మంచిది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.