astrology

ఆగస్టు 21న కుజుడు ,శుక్రుడు తన రాశి  మార్చుకుంటున్నారు. ఈ రాశి మార్పు కారణంగా అశుభ ఫలితాలు ఈ ఐదు రాశుల వారికి ఏర్పడతాయి ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభరాశి:  శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపార పరంగా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు తమపై అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. డబ్బు తక్కువగా రావడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు కోరుకున్న రంగంలో సీటు లభించదు.

మిథున రాశి:  మిథున రాశి వారికి ఈ గ్రహాల మార్పు కారణంగా భూమికి సంబంధించిన విషయాల్లో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ ఆదాయం వనరులు తగ్గిపోతాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. మీ ఇంట్లో తల్లి ఆరోగ్యం గురించి కాస్త జాగ్రత్త పడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ అన్నదమ్ములు సోదరితో గొడవలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.

కర్కాటక రాశి:  ఈ రాశి వారికి దూర ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ విలువైన వస్తువులు దొంగలించబడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మీకు కమ్యూనికేషన్ కు సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతారు. పై అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. సంఘంలో మీ ఆత్మ గౌరవం మీ పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి. ఇంట్లో గొడవలు జరుగుతాయి.

Astrology: ఆగస్టు 25 నుంచి శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం

మీనరాశి:  ఈ రాశి వారికి మీకు డబ్బు వృధాగా ఖర్చు పెడతారు. మీరు చేస్తున్న మీరు పని చేస్తున్న చోట గౌరవం కోల్పోయే అవకాశం ఉంది. మీ సహోదయోగులతో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహారాల్లో ఆచితూచి అడుగులు వేయండి సమస్యలు ఎక్కువ అవుతాయి. దీని ద్వారా మీకు ఖర్చులు ఎక్కువ అవుతాయి. మీ పిల్లల చదువులో ఆటంకాలు ఎదురవుతాయి. తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడతాయి .కోర్టు సమస్యల నుండి విముక్తి కలగదు

వృశ్చిక రాశి:  ఈ రాశి వారికి విద్యార్థులు పోటీ ఫలితాలలో విజయం సాధించరు. స్నేహితులచే మోసగింపబడతారు. వీరు మానసికంగా నిరాశగా ఉంటారు. వైవాహిక జీవితంలో తరచుగా గొడవలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామిగా విభాగాలు పెరుగుతాయి. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు మీ సామాజిక ప్రతిష్ట తగ్గిపోతుంది. ఆకస్మికంగా మీకు ధన నష్టం జరుగుతుంది. వ్యాపారంలో భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలకు వెళ్లేవారు జాగ్రత్తగా వెళ్లండి. రుణ బాధల నుండి సమస్యలు ఎక్కువ అవుతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.