శని తిరోగమనడం వల్ల అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ 3 రాశుల వారికి అదృష్టం. శని గ్రహం వ్యతిరేక దిశలో కదలడం వల్ల కొన్నిరాశుల పైన ప్రతికూల ప్రభావము తగ్గుతుంది. శని అనుగ్రహం పొందే ఆ మూడు రాశుల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి అనుగ్రహం ఉంటుంది. విద్యార్థులకు వచ్చే అవకాశం ఉంది కొత్త స్నేహితులు ఏర్పడతారు సామాజికంగా మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దాని వల్ల మీకు లాభాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరితోటి సంతోషంగా గడుపుతారు. ప్రేమ వివాహానికి అనుకూలం.

వృశ్చిక రాశి:  ఈ వృశ్చిక రాశి వారికి శని తిరోగమనడం. వల్ల ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశాలు చాలా ఉన్నాయి. ధన ప్రవాహానికి అడ్డు ఉండదు. విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. ఆరోగ్యపరంగా ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న సమస్య నుంచి బయటపడతారు. ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. మీకు నచ్చిన దగ్గరికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Health Tips: బరువు తగ్గడానికి టీ మానేయాలా..?

మిథున రాశి: ఈ రాశి వారికి శని అనుకూల అవకాశాలు ఇస్తాడు . కళా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించడంలో విజయాన్ని సాధిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల నుండి ఉపశమనం పొందుతారు. విద్యార్థులకు విదేశాల్లో చదివే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న రుణ సమస్యల నుంచి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.