జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశిలోకి సూర్యుడు సంచారం కారణంగా అనేక రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని రాశుల వారికి ప్రభావం కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి- ఈ రాశి వారికి సూర్యగ్రహం సంచారం కారణంగా మంచి ప్రభావాన్ని చూపుతుంది. రియల్ ఎస్టేట్ రంగాలలో మీకు కలిసి వస్తుంది. కొత్త ఆదాయం వస్తాయి. దీని వల్ల మీకు ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ ని పొందుతారు. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తారు. విద్యార్థులకు ఇది మంచి సమయం పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణమితులు అవుతారు. ప్రేమ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో అంత సజావుగా ఉంటుంది. విదేశాలకు వెళ్తారు.
Astrology: సెప్టెంబర్ 30 శుక్రుడు ఫాల్గుణి నక్షత్రంలోనికి ప్రవేశం.
సింహరాశి- సూర్యుని సంచారం కారణంగా ఈ రాశి వారికి చాలా అనుకూలం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. దీని వల్ల కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ఉత్సాహంగా ఉంటారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్తారు. మీరు ఎప్పుడో డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
తులారాశి- ఈ రాశి వారికి మీరు ఎప్పటినుంచ ఇబ్బంది పడుతున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీని ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ఆదాయాన్ని పొందుతారు. ఆ సూర్యగ్రహం మీ పైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది శుభ సమయం. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఉద్యోగం చోట ప్రమోషన్ లభిస్తుంది. మీరు చేసే ప్రతి పని కూడా ప్రశంసలు అందుతాయి. ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.