astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ,గురు గ్రహం సెప్టెంబర్ 22న కలయిక. ఈరోజు సింహరాశిలోకి ప్రవేశించడం ద్వారా ఈ రెండు రాశులు కూడా తమ గమనాన్ని మార్చుకుంటాయి. సూర్యుడు ,గురు గ్రహాల కదలిక వల్ల ఈ మూడు రాశుల వారికి ధనవర్షం కురుస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యా రాశి- ఈ రాశి వారికి గురుడు ,సూర్యుడి కలయిక వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా సానుకూలమైన మార్పులు వస్తాయి. ప్రతి పనిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టిన దగ్గర నుండి మంచి లాభాలు వస్తాయి. మీ కెరీర్లో మంచి ప్రశంసలు అందుకుంటారు. మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ అందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూల సమయం. కొత్త కస్టమర్లను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రేమ వివాహాలకు అనుకూలం.

తులారాశి- గురుడు ,సూర్యుని కలయిక వల్ల ఈ రాశి వారికి అంతా శుభ ఫలితాలు ఉంటాయి. వీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా పూర్తి చేయడం ద్వారా ఉత్సాహంగా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉత్సాహంతో ఎప్పుడు ప్రయత్నిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశాల్లో వ్యాపార విస్తరణ చేస్తారు. విద్యార్థులకు కలల పట్ల సృజనాత్మక పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధం బాంధవ్యాలు పెరుగుతాయి.

Astrology: మల్లికార్జున స్వామికి ఇష్టమైన 4 రాశులు ఇవే

మీన రాశి- ఈ రాశి వారికి మానసిక స్థితి మెరుగుపడుతుం.ది సెన్సిటివ్ విషయాల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులలో అనుబంధం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పూర్వీకుల నుండి రావలసిన ఆస్తి వస్తుంది. వ్యాపారంలో లాభాల మార్చిన పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే కళ నెరవేరుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.