astrology

ప్రతి గ్రహం తన రాశిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. దీని వల్ల అన్ని రాశుల వారు కొంత ప్రభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా గ్రహాలు వాటి గమనాన్ని మార్చడం ద్వారా కొన్ని శుభ ఫలితాలు ఏర్పడతాయి. సెప్టెంబర్ 27న చంద్రుడు ,గురుడు కలయిక వలన గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి యోగం వల్ల మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యా రాశి- ఈ రాశి వారికి చంద్రుడు, గురుని కలయిక వల్ల అదృష్టం వీరిలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. దీని ద్వారా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కెరీర్ పరంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. మీరు చేస్తున్న పనిలో ప్రమోషన్ వస్తుంది. ఆకస్మికంగా ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరగడం వల్ల మీ అప్పులన్నీ తీరిపోతాయి. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం.

ధనస్సు రాశి- ఈ రాశి వారికి డబ్బు సంపాదనకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. వీరు చేసే పనిని ఆత్మవిశ్వాసంతో కృషితో ముందుకు తీసుకువెళ్తారు. ఇది ఆర్థికంగా మిమ్మల్ని బలోపేతం చేస్తుంది. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగస్తులు మీరు చేసే పనిలో ఆనందంగా ఉంటారు. మీ జీతం కూడా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మీకు వ్యాపారంలో లాభాలు వస్తాయి. దీని కారణంగా మీరు ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న రుణ బాధల నుండి విముక్తి పొందుతారు.

Astrology: మల్లికార్జున స్వామికి ఇష్టమైన 4 రాశులు ఇవే

వృశ్చిక రాశి- ఈ రాశి వారికి చంద్రుడు ,గురుడు కలయిక వల్ల గజకేసరి యోగం ఈ రాశి వారికి కొన్ని శుభవార్తలను తీసుకువస్తుంది. ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. మీ వ్యాపారంలో కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. దుకాణ దారులకు ఆదాయం రెట్టింపు అవుతుంది వివాహం కాని వారికి మంచి జీవిత భాగస్వామి వస్తారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గిపోతాయి. ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య నుండి మెరుగుపడే అవకాశం ఉంది. దీని ద్వారా మీరు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.