astrology

న్యూమరాలజీ ప్రకారం ప్రతి వ్యక్తికి ఒకటి నుండి తొమ్మిది అంకెల వరకు సంఖ్యలు కేటాయించబడతాయి. అయితే ఇక్కడ ఈరోజు మనం ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి చిన్న వయసులోనే ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ నాలుగు తేదీ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

4వ తేదీ: ఏ నెలలో అయినా నాలుగో తేదీలో పుట్టిన వారు డబ్బు విషయంలో చాలా అదృష్టవంతులు. వీరికి వ్యాపార రంగంలో మంచి అవగాహన కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు చిన్నప్పటి నుంచి కూడా డబ్బు నిర్వహణ పైన ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. వీరికి కృషి చేసే తత్వము శ్రమ పడే తత్వము అపారమైన జ్ఞానము ఉండడం వల్ల ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్తారు. వారి లక్ష్యాలను సాధిస్తారు. పొదుపు చేయాలనే పట్టుదల కూడా వీరిలో చాలా ఉంటుంది. అందువల్ల నాలుగో తేదీన పుట్టిన వారు చిన్న వయసులోనే ధనవంతులవుతారు.

13వ తేదీ: ఏ నెలలో అయినా 13వ తారీకు జన్మించిన వారికి కీర్తి ప్రతిష్టలు సాధించాలని బలమైన కోరిక ఉంటుంది. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటాడు. దానికి తగ్గట్టుగా శ్రమ కృషి చేస్తాడు. అందుకోసం మీరు చిన్న వయసులోనే కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. అదేవిధంగా వీరికి ఫైనాన్షియల్ రంగంలో కూడా మంచి అవగాహన ఉంటుంది. వీరు చేసే ప్రతి పని కూడా డబ్బుతో ముడిపెట్టినట్లు చూస్తారు. తద్వారా వీరు త్వరలోనే ధనవంతులవుతారు.

Astrology: 100 సంవత్సరాల తర్వాత ఒకేసారి ఏర్పడిన నాలుగు యోగాలు.

22వ తేదీ: ఏ నెలలో అయినా 22వ తేదీ జన్మించిన వారి సంఖ్య రాడికల్స్ సంఖ్య 4 ఉంటుంది. ఈ తేదీ ఉన్నవారు చిన్నతనం నుండే ధనవంతులు కావాలని కోరికను పెంచుకుంటారు. దానికి తగ్గట్టుగానే కృషి చేస్తారు. చిన్న వయస్సులోనే ఆర్థికంగా శ్రేయస్సు కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. రాడిక్స్ సంఖ్య వీరికి డబ్బు పరంగా చాలా శక్తివంతమైంది. వీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఆర్థికంగా విజయాన్ని సాధించే సామర్థ్యం కలిగి ఉంటారు.

31వ తేది: న్యూమరాలజీ ప్రకారం ప్రతి నెలలో 31వ తేదీన జన్మించిన వారికి కళలు, సంగీతం, నృత్యం వంటి ప్రత్యేక సామర్థ్యాలను కలిగి ఉంటారు, ఈ సామర్ధ్యాల వల్ల వారికి చిన్న చిన్న వయసులోనే డబ్బు సంపాదించాలని కొత్త మార్గాలు ఏర్పడతాయి, రియాల్టీ షోలు టీవీ షోలో కూడా పాల్గొంటారు, తక్కువ సమయంలోనే లక్షలు సంపాదిస్తారు, వీరి వార్షిక ఆదాయం కూడా లక్షల్లోనే ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.