astrology

జూలై 30న కుజుడు ,గురుడు మేషరాశిలో ఉంటాడు, ఆ తర్వాత వృషభ రాశిలోకి వెళుతుంది, అప్పుడు కొన్ని రాశుల వారికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది, ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి: ఈ రాశి వారికి వ్యాపారంలో మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కస్టమర్ మోసం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి. మానసిక ధైర్యం దెబ్బతింటుంది. చిన్న విషయాలక కోపం తెచ్చుకుంటారు. మానసిక స్థితి కూడా క్షీణిస్తుంది. ఆరోగ్యం పైన కాస్త ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.చెవి సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

సింహరాశి:  చేపట్టిన ప్రతి పనిలో వాయిదా పడతాయి. వ్యాపారంలో భారీ నష్టాలను చెవి చూడవలసి వస్తుంది.  విద్యార్థులకు కాస్త ఇబ్బందికర పరిస్థితి అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడి కారణంగా మీలో ఆత్మవిశ్వాసం తగ్గవచ్చు నిరాశకు గురవుతారు. దీని నివారించడం కోసం ధ్యానము వ్యాయామం చేయడం ఉత్తమం.

Health Tips: తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత పొదుపు చేసినప్పటికీ ఖర్చులు అధికంగా అవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. చట్టపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్లో ఉన్న పనులు ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చర్చించుకునేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి లేకపోతే గొడవల అయ్యే ప్రమాదం ఉంది. దూర ప్రయాణాలకు వెళ్లకపోవడమే మంచిది. నూతన గృహాన్ని కొనుగోలు చేయాలనుకున్నవారు కాస్త ఆగడం ఉత్తమం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.