జ్యోతిక శాస్త్రం ప్రకారం కుజుడు ,గురుడు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అనుకూలంగానూ కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. ఆగస్టు 12 నుండి బుధుడు ,గురుడు ఒకే స్థాయిలో ప్రయాణిస్తాయి.కాబట్టి ఈ మూడు రాశుల వారికి జీవితాల్లో కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం..
మీన రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొదుపు చేసిన డబ్బులు కూడా అయిపోతాయి. పనులు సకాలంలో పూర్తి కావు. మీరు ప్రారంభించిన వ్యాపార పథకాలు అన్నీ కూడా నిలిచిపోతాయి. కుటుంబంలో అసంతృప్తిగా ఉంటారు. బంధువుల నుండి వివాదాలు పెరగవచ్చు. మీ ఇంట్లో పిల్లలు గాయపడే అవకాశం ఉంది. ఈ మీన రాశి వారు డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమవుతాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి గురు గ్రహం ,కుజ గ్రహం కలయిక వల్ల కొంత ఆర్థిక నష్టము జరుగుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి కొన్ని రోజులు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చెడు రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. మీ మనోబలం తగ్గుతుంది. వ్యాపారంలో భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంటి యజమానితో గొడవలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహనంలో ప్రయాణం చేసే వారికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో పెద్దలకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. దూర ప్రయాణాలకు వెళ్లకపోవడమే ఉత్తమం.
Astrology: ఆగస్టు 4న శుక్రుడు కుంభ రాశిలోకి ప్రవేశం.
మేష రాశి: ఈ రాశి వారికి కూడా ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. పెట్టుబడి పెట్టిన దగ్గర డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు అసలు పెట్టకండి ఎందుకంటే నష్టాలు రావచ్చు నిరుద్యోగులకు అసంతృప్తి ఉంటుంది. పని భారం కూడా ఉద్యోగస్తుల్లో పని భారం కూడా పెరుగుతుంది. మీ ఇంట్లో పెద్దవాళ్ల ఖర్చులు ఎక్కువ అవుతాయి. వైవాహిక జీవితంలో గందరగోళం ఉంటుంది. ప్రేమ వివాహాలకు అనుకూలం కాదు. కోర్టు సమస్య పూర్తి అవ్వదు మానసికంగా చాలా తీవ్ర నిరాశకు గురవుతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.