astrology

జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధ గ్రహం రాముతో కలయిక వల్ల కొన్ని శుభశకునాలు వస్తాయి. దీని ద్వారా ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీన రాశి:  బుధుడు ,రాహు కలయిక వల్ల ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాట తీరు వల్ల సమాజంలో మీకు ఆకర్షణీయంగా కనబడతారు. విద్యార్థులకు అనువైన సమయం. ఉద్యోగస్తులు ఎప్పటినుంచో అనుకుంటున్న ఉద్యోగం మీకు లభిస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులు వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.

తులారాశి: తుల రాశి వారికి రాహు ,బుధుడు కలయిక వల్ల చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. విద్యారంగానికి సంబంధించి విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. వారి ప్రాజెక్టులకు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. మీరు వారి సీనియర్ల నుండి ఉపాధ్యాయుల నుండి సహాయాన్ని కూడా పొందుతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. విదేశాల్లో కూడా మీరు పెట్టుబడులు పెట్టి దాని ద్వారా అధిక లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. డబ్బు ఆదా చేయడంలో మీరు విజయాన్ని సాధిస్తారు. మీ కుటుంబ సభ్యులతో మీకు అన్యోన్యం పెరుగుతుంది. వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు.

Astrology: 90 ఏళ్ల తర్వాత వచ్చే చతుర్ గ్రహియోగం ఆగస్టు 19న

కన్యా రాశి: ఈ రాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దృష్టి ఎప్పుడు కూడా డబ్బు సంపాదన పైనే ఉంటుంది. దీని ద్వారా మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది. అప్పుల నుండి కూడా ఉపశమనాన్ని పొందుతారు. మీరు విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది అనువైన సమయం. వ్యాపారవేత్తలతోటి పెద్ద ఒప్పందాలు చేసుకుంటారు. ఆన్లైన్ వ్యాపారం చేసుకునే వ్యక్తులకు మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ప్రేమ వివాహాలకు అనుకూలం. వివాహితుల జీవితంలో సంతోషకరమైన వాతావరణము ఉంటుంది. సంతాన సమస్య కూడా పరిష్కారం అవుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.