జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు చంద్రుడికి ఇష్టమైన గ్రహం బుధ గ్రహం. ప్రస్తుతం బుధ గ్రహం సింహరాశిలోకి సంచరిస్తున్నాడు. అయితే సెప్టెంబర్ 23 సోమవారం 10 గంటలకు బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి- కారణంగా ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వీరు మృదు స్వభావం కల వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వారికి జీతం పెరుగుతుంది. వ్యాపార ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు.
Astrology: సెప్టెంబర్ 27 గురు గ్రహం ,చంద్రుడు కలయిక
కర్కాటక రాశి- ఈ రాశి వారికి కన్య రాశిలోకి బుధుడు సంచారం కారణంగా ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టపడి పని చేసే తత్వంతో మీరు ప్రతి పనిని కూడా అంకితభావంతో చేస్తారు. ప్రైవేట్ ఉద్యోగం చేసే వారికి మీ జీవితం రెట్టింపు అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీరు పని చేసే చోట యజమానుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపార విస్తరణకు అనుకూలము దీనివల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులు విదేశంలో చదువుకోడానికి అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది ఇంట్లో పెద్దలు మీ ప్రేమ వివాహానికి అంగీకరిస్తారు.
మీనరాశి- ఈ రాశి వారికి అనుకూలంగా ప్రభావం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. దీని ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో చేసే వరకే పని భారం పెరుగుతుంది. కానీ దాన్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం కొత్త వ్యాపార అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం చదువు పైన ఏకాగ్రత వల్ల మీరు మంచి ఫలితాలను మంచి ఫలితాలను సాధిస్తారు. బంధువులతో సంబంధాలు బాగుంటాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.