astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపదకు ఆనందానికి అధిపతి శుక్రుడు గ్రహం అయితే శుక్ర గ్రహం ఆగస్టు 11న పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశించింది. ఆ తర్వాత మళ్లీ ఆగస్టు 22న మరోసారి తన రాశిని మార్చుకుంటుంది. ఓకే నెలలో రెండు సార్లు శుక్ర గ్రహం సంచారం కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం.

తులారాశి: ఈ రాశి వారికి శుక్ర గ్రహ సంచారం కారణంగా జీవితం ఆనందమయంగా ఉంటుంది. ప్రేమ వివాహాలకు అనువైన సమయం. జీవిత భాగస్వామితో సంబంధం బాంధవ్యాలు బలపడతాయి. మీ కుటుంబంలోకి కొత్త అదితి రావచ్చు. ఉద్యోగస్తులు ఉత్తమ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే అనువైన సమయం డబ్బు సంపాదించడానికి అనేక నూతన మార్గాలు ఉంటాయి. అంతేకాకుండా మీరు సమాజంలో ఉన్నత స్థానానికి వెళ్తారు మీరు చేసే పని పైన ఏకాగ్రత శక్తి పెరుగుతుంది.

Astrology: ఆగస్టు 19న కుజుడు మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి శుక్రుని దయ ఎల్లప్పుడూ ఉంటుంది. వ్యాపారం చేసే వారికి వ్యాపార రంగంలో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో సీటు లభించి ప్రవేశాన్ని పొందుతారు. దీనితో తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న మీ తల్లి ఆరోగ్యం సమస్య మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో వృద్ధులకు ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు విదేశ యానం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు.

మేష రాశి: మేష రాశి వారికి శుక్రుని సంచారం ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుంది. విద్యార్థులకు ఆగస్టు 25 లోపు కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులు మీరు ప్రమోషన్ లభించి మీ జీతం పెరుగుతుంది. భాగస్వామితో విభేదాలు తొలగిపోయి వారి మద్దతు మీకు లభిస్తుంది. ఇది జీవితంలో ముందుకు సాగడానికి మీకు సహకరిస్తుంది. ప్రేమ వివాహాలకు అనుకూలం ఎప్పటినుంచ ఇబ్బంది పెడుతున్న మానసిక సమస్యల నుండి బయటపడతారు. మీ వ్యాపారాన్ని విదేశాల్లో విస్తరించడానికి అనువైన సమయం నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. యువతకు కోరుకున్న రంగంలో ఉద్యోగం లభిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.