ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ సంపూర్ణంగా అవతరించిన మాసమే రంజాన్. ఈ రంజాన్ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు చేపడతారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్ మాసం.. మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది. నెల రోజుల ఉపవాస దీక్ష అనంతరం ‘ఈద్ ఉల్ ఫితర్’ పండుగతో రంజాన్ పండుగ ముగుస్తుంది. ఈ ఏడాది మే 3న ముస్లిం సోదరుల రంజాన్ ఉపవాసాలు ముగించుకొని ‘ఈద్ ఉల్ ఫితర్’ నిర్వహించనున్నారు.
కాగా నెలవంక కనిపించే సమయాన్ని బట్టి.. ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో ఈద్ ఉల్ ఫితర్ జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ సారి రంజాన్ పండుగను మే 3న జరుపుకోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభమైన ఉపవాస దీక్ష మే 2 తో ముగిసింది. ఆదివారం నాడు నెలవంక కనిపించడంతో సోమవారం చివరిరోజు ఉపవాస దీక చేయాలని, మంగళవారం రంజాన్ జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) పేర్కొంది. కాబట్టి మే 3న (మంగళవారం) రంజాన్ జరుపుకోవాలని పిలుపునిచ్చింది. రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్ తెలిపే కోట్స్, వాట్సప్ ఇమేజెస్, ఫేస్‌బుక్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈద్ ఉల్ ఫితర్ విషెస్, రంజాన్ శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగ్ కార్డ్స్ మీకోసం
ఉపవాసంతో ఆకలిదప్పులతో మనిషిని బాధించడం ఇస్లాం ఉద్దేశం కాదు. పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే ఉపవాసం ఉద్దేశం. ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని, మీ జీవితాన్ని సుఖశాంతులతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ.. సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అల్లాహ్ అనుగ్రహం అనునిత్యం ఉండాలని, మీ జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. రంజాన్ శుభాకాంక్షలు
రంజాన్ మాసంలో ఉపవాసముండి ప్రార్థనలు చేస్తే, మీ కోరికలు నెరవేరుతాయి. రంజాన్ శుభాకాంక్షలు
ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లాహ్ మీ కష్టాలను తొలగించి, మీకు శాంతి, సంపద, ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు ఇస్తాడని ఆశిస్తూ..మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు.
అల్లా మీ అందరినీ చల్లగా చూడాలి. సుఖ శాంతులు మీ ఇంట నిత్యం నెలవుండాలి. LatestLY తరపున ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు.