వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో సరైన వస్తువులు పెట్టినట్లయితేనే సానుకూల ఫలితాలు లభిస్తాయి. డబ్బులు బంగారం వెండి వంటి వాటిని సరైన దిశలో ఉంచాలి. అప్పుడే మీకు ధనలక్ష్మి దేవి కృపా కటాక్షాలు ఉంటాయి. అలా కాకుండా ఏ దిక్కున పడితే ఆ దిక్కున పెట్టినట్లయితే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. సరైన దిశలో గనక మీరు బంగారం డబ్బును పెడితే అవి రోజురోజుకే పెరుగుతాయి. వాస్తు శాస్త్రంలో డబ్బు బంగారం వెండి ఉంచడానికి సరైన దిశలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం బంగారము, వెండి, డబ్బులు సరైన దిశలో ఉంచకపోతే తీవ్ర నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎప్పుడూ కూడా విలువైన ఆభరణాలు డబ్బు ఉత్తరం వైపు మాత్రమే ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం దేవతలు వారి దిశను బట్టి నివసిస్తూ ఉంటారు. అదే విధంగా ఇంటి ఉత్తరం వైపున లక్ష్మీదేవి సిరిసంపదలకు అధిపతి అయిన కుబేరుడు నివసిస్తూ ఉంటారు. అందువల్ల మన విలువైన ఆభరణాలైన బంగారం, వెండి, డబ్బు వంటివి ఉత్తర దిశలో ఉంచడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
డబ్బులు ,వెండి, బంగారు ఆభరణాలు ఎప్పుడు కూడా ఉత్తర దిశలో ఉంచడం వల్ల దేవతల ఆశీర్వాదం వల్ల మీ సంపద ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. ఈ దిశలో పెట్టడం వల్ల ఎప్పటికీ మీకు ఆర్థిక సమస్యలు ఉండవు.
Astrology: 90 ఏళ్ల తర్వాత వచ్చే చతుర్ గ్రహియోగం ఆగస్టు 19న..
వాస్తు శాస్త్రం ప్రకారం మీ విలువైన ఆభరణాలను డబ్బును ఎప్పుడు కూడా పడమర దిశలో ఉంచకూడదు. దీనివల్ల మీకు అపార ఆస్తి నష్టం ఆరోగ్య పరమైన చిక్కులు ఏర్పడతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా వెండి బంగారం డబ్బుని పడమర దిశలో ఉంచకూడదు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.