Hyderabad, Sep 18: నేడు వినాయకచవితి (Vinayaka Chathurthi) పర్వదినం. దేశవ్యాప్తంగా నవరాత్రి శోభ మొదలైంది. ఎప్పట్లాగానే హైదరాబాదులోని (Hyderabad) ఖైరతాబాద్ మహా గణపతి (Khairatabad Maha Ganapathi) నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక్కడ గణేశ్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి ఖైరతాబాద్ లో 63 అడుగుల గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Hyderabadis get first glimpse of Khairatabad Ganesh, all set for installation.#GaneshChaturthi#VinayakaChavithi#khairatabadGanesh#Hyderabad pic.twitter.com/vpKLDp0guH
— Deccan Chronicle (@DeccanChronicle) September 17, 2023
శ్రీ దశ మహా విద్యా గణపతి
ఈసారి స్వామివారు శ్రీ దశ మహా విద్యా గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ విగ్రహాన్ని పూర్తిగా మట్టితో తయారుచేశారు. 150 మంది 3 నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.