Independence Day Wishes in Telugu

Independence Day Wishes in Telugu: బ్రిటిష్ వారి రాక్షస పాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day 2021) జరుపుకుంటూ వస్తున్నాం. మహానీయులను గుర్తు చేసుకుంటున్నాం.

జెండాలో ఉన్న ఒక్కో రంగు ఒక్కో విషయాన్ని మనకు తెలియజేస్తాయి. కాషాయ రంగు దేశ పటిష్టతకు, ధైర్యానికి ప్రతీకగా నిలిస్తే, మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. కింద ఉండే ఆకుపచ్చ రంగు దేశ ప్రగతికి సూచికగా నిలుస్తుంది. ఇక మధ్యలో ఉండే అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది.భారత జాతీయ జెండాను 1947 జూలై 27వ తేదీన నిర్వహించిన రాజ్యాంగ సభలో మొదటగా ఆమోదించగా, ఆ తరువాత నుంచి అదే జెండాను మనం ఉపయోగిస్తూ వస్తున్నాం. భారత జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకం, మువ్వన్నెల జెండా అని కూడా పిలుస్తారు.  భారత స్వాతంత్ర్య దినోత్సవం మెసేజెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పేయండి

ఈ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమానమైన నిష్పత్తిలో ఉంటాయి. మధ్యలో 24 ఆకులతో ఆకాశనీలం రంగులో అశోక చక్రం ఉంటుంది.

Happy-independence-day-Wishes-in-Telugu_

Happy-independence-day-Wishes-in-Telugu_3

Happy-independence-day-Wishes-in-Telugu_4

కాగా భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది మన తెలుగు వాడైన పింగళి వెంకయ్య. ఆయన రూపొందించిన జెండానే ఇప్పటికీ మనం వాడుతున్నాం.