Sarla Thukral Birth Anniversary: సరళా ఠక్రాల్ 107వ జన్మదినం, చీర కట్టుకుని విమానం నడిపిన మొట్టమొదటి భారత మహిళా పైలట్, సరళా థక్రాల్ 107వ జయంతి సందర్భంగా డూడుల్‌తో నివాళి అర్పించిన గూగుల్, సరళ తక్రాల్ జీవిత విశేషాలు ఓ సారి చూద్దామా..
Sarla Thukral, First Indian Woman to Pilot ( PC: Google Home Page

భారతీయ పైలట్, డిజైన్ మరియు వ్యవస్థాపకుడు సరళా ఠక్రాల్ 107వ పుట్టినరోజు (Sarla Thukral Birth Anniversary) సందర్భంగా గూగుల్ తన డూడుల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. సరల్ ఠక్రాల్ జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్ తయారు చేయడం ద్వారా ఆమెకు ఘనంగా నివాళి (Sarla Thukral Google Doodle) అర్పించింది. భారతదేశంలో చీర కట్టుకుని విమానం నడిపిన మొట్టమొదటి మహిళా పైలట్ థక్రాల్ (First Indian Woman to Pilot an Aircraft). ఈమె 1936 లో ఒక చిన్న రెండు రెక్కల విమానం కాక్‌పిట్‌లోకి అడుగుపెట్టినప్పుడు చరిత్ర సృష్టించింది.

సరళ థక్రాల్ భారతదేశంలో విమానం నడిపిన మొదటి మహిళగా పేరుగాంచారు. సరళా థక్రాల్ 8 ఆగస్టు 1914 లో అప్పటి బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. ఆమె ఫైలటె్ కావడానికి తన భర్తే ప్రేరణ అని చెప్పేది. ఆయన దగ్గర సరళా ఫైలట్ శిక్షణ తీసుకుంది. ఆమె కుటుంబంలో మొత్తం తొమ్మిది మంది పైలట్లు ఉన్నారు. సరళ థక్రాల్ లాహోర్ ఫ్లయింగ్ క్లబ్‌లో సభ్యురాలు. ఆమె 16 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంది. అయినప్పటికీ కుటుంబ బాధ్యతల మధ్య కూడా ఆమె తన కలలను సజీవంగా ఉంచింది.

మాస్కులు ధరించాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది. మాస్క్ ధరించండి, ప్రాణాలు కాపాడండి, కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ గూగుల్ డూడుల్, దేశంలో శరవేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు

సరళా ఠక్రాల్ 1936 లో మొదటిసారిగా రెండు రెక్కల చిన్న విమానాన్ని నడిపినప్పుడు చరిత్ర సృష్టించింది. ఆ సమయంలో ఆమె వయస్సు కేవలం 21 సంవత్సరాలు. అలాగే ఆమె నాలుగేళ్ల కుమార్తెకు తల్లి. ఆమె సాంప్రదాయ చీరను ధరించి కాక్‌పిట్‌లోకి అడుగుపెట్టింది, తద్వారా ఇకపై ఆకాశంలో ప్రయాణం అనేది పురుషుల డొమైన్ కాదని ప్రపంచానికి సందేశం పంపింది. ఏదేమైనా, కేవలం మూడు సంవత్సరాల తరువాత తన భర్త కెప్టెన్ పిడి శర్మ 1939 లో విమాన ప్రమాదంలో మరణించినప్పుడు, ఆమె జీవితంలో కోలుకోలేని స్థితికి చేరుకుంది.

ఆమె భర్త మరణం తరువాత, సరళా ఠక్రల్ వాణిజ్య పైలట్ కోసం సిద్ధమవడం మొదలుపెట్టింది, అయితే అది రెండవ ప్రపంచ యుద్ధం సమయం, ఇది ఆమె కెరీర్‌కు ముగింపు పలికింది. సరళ థక్రాల్ ఆ తరువాత లాహోర్‌లోని మేయో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుండి లలిత కళ మరియు చిత్రలేఖనాన్ని అభ్యసించారు, దీనిని ఇప్పుడు నేషనల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అని పిలుస్తారు. 1947 లో విభజన తర్వాత ఆమె భారతదేశానికి వచ్చింది. ఢిల్లీలో నివసిస్తూ అక్కడే ఆమె పెయింటింగ్ పనిని కొనసాగించింది.

కరోనా వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? ఇతర మందులు వాడేవారు తీసుకోవచ్చా, తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది, డాక్టర్లు ఏమంటున్నారు ఓ సారి తెలుసుకోండి

ఆ తరువాత, ఆమె ఆభరణాలు మరియు దుస్తుల రూపకల్పనలో విజయవంతమైన డిజైనర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆమె ఫైలట్ మాత్రమే కాదు విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్త కూడా, చిత్రకారుడు మరియు కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ఆమె తదనంతరం 1948 లో RP Thakral ని రెండో వివాహం చేసుకుంది. సరళా మార్చి 15, 2008 న మరణించింది. గూగుల్ ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా డూడుల్‌తో నివాళులర్పించింది.