Newdelhi, Aug 29: నేడు తెలుగు భాషా దినోత్సవం (Telugu Language Day). ఆగస్టు 29న ఏటా ఈరోజును జరుపుకుంటారు. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి (Gidugu Venkata Rammurthi) జయంతి నేడు. తెలుగు భాషలో (Telugu Language) ఆయన చేసిన అద్భుతమైన పనిని గౌరవించటానికి.. ఆయన జయంతిని దృష్టిలో ఉంచుకుని, ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 29 న జరుపుకుంటారు. ఈ ఏడాది కవి గిడుగు వెంకట రామమూర్తి 160వ జయంతి వేడుకలు కూడా జరుగుతున్నాయి.
🍁 తెలుగు కవులకు , సాహితీవేత్తలకు, తెలుగు బోధించు ఉపాధ్యాయులకు, తెలుగు మాతృభాష అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానీకానికి తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు 🙏💐🙏 pic.twitter.com/nBPMyzPTBf
— K.Chitti Babu (@KCBABU_1956) August 29, 2023
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసి తెలుగు భాష గొప్పతనాన్ని ఉద్ఘాటించారు. #MannKiBaat pic.twitter.com/UJMSzIc9Bc
— BJPShanthikumar (@BJPShanthikumar) August 27, 2023
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు #తెలుగుభాషాదినోత్సవం#TeluguLanguageDay pic.twitter.com/BS63p5xzoQ
— Lakshmi (@Itsmelakshmi06) August 29, 2023
మన్ కీ బాత్ కార్యక్రమంలో..
ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ తెలుగు భాషా దినోత్సవంపై స్పందించారు. కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘మన సంస్కృతి, సంప్రదాయాలతో అనుసంధానం కావడానికి మాతృ భాష చాలా శక్తివంతమైన మాధ్యమం. భారత్ లో ఎంతో వైభవోపేతమైన భాష తెలుగు. అందుకే ఈ నెల 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుందాం. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు’ అని మోదీ పేర్కొన్నారు.