Chandipura Virus Alert(X)

New Delhi, Jan 13: భారత్‌లో హ్యూమన్ మెటాప్‌ న్యూమో వైరస్ (HMPV) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పుదుచ్ఛేరిలో మరోచిన్నారికి హెచ్‌ఎమ్‌పీవీ వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.ఆరోగ్య శాఖ అధికారి రవిచంద్రన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు చిన్నారి జ్వరం, దగ్గు, జలుబుతో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో చేరినట్లు తెలిపారు.

చైనా నుంచి ప్రయాణ చరిత్ర లేకపోయినా ఇండియాలో పెరుగుతున్న హెచ్‌ఎమ్‌పీవీ కేసులు, మొత్తం 7కు పెరిగిన కేసుల సంఖ్య

ప్రస్తుతం చిన్నారి వైద్య చికిత్సకు సహకరిస్తోందని చెప్పారు. కాగా, తాజా కేసుతో పుదుచ్ఛేరిలో హెచ్‌ఎమ్‌పీవీ కేసులు రెండుకు చేరాయి. గతవారం మూడేండ్ల చిన్నారి ఈ వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యింది. తాజా కేసుతో కలిపి భారత్‌ (India)లో హెచ్ఎమ్‌పీవీ కేసులు 18కి చేరాయి.