Newdelhi, July 19: దోమల (Mosquitoes) ద్వారా వచ్చే డెంగ్యూ కేసులు (Dengue Cases) ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్నాయి. అయితే, ఈ డెంగ్యూ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు కూడా ఉంటుందని వైద్యులు తాజాగా హెచ్చరించారు. డెంగ్యూ వ్యాధి సోకిన తొలి రెండు నెలల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ గా పేర్కొనే తీవ్రమైన ప్లాస్మా లీకేజీ వల్ల మెదడు సహా కీలకమైన అవయవాలకు రక్త సరఫరా సరిగ్గా జరగదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే స్ట్రోక్ ముప్పు ఉంటుందని వెల్లడించారు.
చిలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రత నమోదు
Can Dengue Cause A Stroke? Doctors Warn of Serious Neurological Complications As Cases Surge Across India#TNCards #Dengue #Stroke
Read More: https://t.co/cy5aFHRgUQ pic.twitter.com/FP4J06q0qM
— TIMES NOW (@TimesNow) July 18, 2024
డెంగ్యూ లక్షణాలు ఇవి..
సాధారణంగా డెంగ్యూ బాధితుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు, దద్దుర్లు, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో డెంగ్యూ ప్రభావం మెదడు, నాడీ వ్యవస్థపై కూడా పడుతుందని పలువురు వైద్యులు పేర్కొన్నారు.
వృద్ధాప్యానికి బైబై.. ఆయుష్షు పెంచే కొత్త ఔషధం.. 25 శాతం పెరిగిన ఎలుకల జీవితకాలం.. మరి మనుషుల్లో..?