
Cold Drinks Increase Testosterone Level: చైనాలోని నార్త్ వెస్ట్ మింజూ యూనివర్సిటీ పరిశోధకులు సంచలన పరిశోధనను చేశారు. వీరి పరిశోధనలో కూల్ డ్రింక్స్ పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయని తేలింది. పెప్సీ, కొకాకోలా(Pepsi, Coca-Cola), థమ్సప్(Thumsup) తరహా కార్బొనేటేడ్ డ్రింక్స్ మగవాళ్లలో సెక్స్ సామర్ధ్యాన్ని పెంచుతాయని వీరి అధ్యయనం వెల్లడించింది. అలాగే వృషణాల అభివృద్ధిని మెరుగుపరుస్తాయని కనుగొనబడింది. దీని ఫలితాలు యాక్టా ఎండోక్రినాల్ జర్నల్‌లో విడుదలయ్యాయి.
మగ ఎలుకలను పలు బృందాలుగా చేసి 15 రోజుల పాటు పరీక్షించి చూశారు. కొకకోలా, పెప్సీని ఒక సమూహంలోని ఎలుకలకు ఇవ్వగా.. మరో సమూహంలో వాటికి సాధారణమైన నీటిని ఇచ్చారు. ఫిజి డ్రింక్స్ తాగిన వాటిలో టెస్టోస్టెరాన్ పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ కూల్ డ్రింక్స్ టెస్టోస్టెరాన్ హర్మోన్లు పెంచుతాయని, దీంతో పురుషుల లైంగిక సామర్థ్యం మెరుగుపడుతుందని, ఆడవారిలో అండాల వృద్ధికి మెలు చేస్తుందని తమ అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు.
మానవ అభివృద్ధికి తాజా ఫలితాలు తోడ్పడతాయని, సోడాకి సంతాన సాఫల్యతకు మధ్య ఉన్న బంధంపై మరింత విసృత్తమైన పరిశోధన అవసరమని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల మగవారి ప్రోస్టేట్ సమస్యలు రాకుండా ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సోడాలు తాగితే.. అది పునరుత్పత్తి సామర్థ్యం వీర్యం నాణ్యతపై ప్రభావం పడుతుందని, గత అధ్యయనాలు చెప్పగా.. తాజా ఫలితాలు భిన్నమైన అభిప్రాయం ప్రకటించడం ఆశ్చర్యపరిచే అంశం. ఇటీవలి అధ్యయనం యొక్క ఫలితాలు మునుపటి అధ్యయనాలను పూర్తిగా తిరస్కరించాయని పరిశోధకులు కనుగొన్నారు.
మొత్తం కోక్ బాటిల్‌ను తాగడానికి ముందు, ఈ అధ్యయనానికి మానవ శరీరంపై ఫిజీ పానీయాల ప్రభావాలపై విస్తృతమైన పరిశోధన అవసరమని తెలుసుకోవాలి. అధ్యయనం యొక్క రచయితల ప్రకారం, వారి పరిశోధనలు మానవ అభివృద్ధి, పునరుత్పత్తి ప్రక్రియలపై ప్రభావాలను, వాటి విధానాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి శాస్త్రీయ ఆధారాన్ని కలిగి ఉన్నాయి. సోడా, సంతానోత్పత్తి మధ్య సంబంధాన్ని నిరూపించడానికి అదనపు పరిశోధన అవసరం కూడా..ఇదిలా ఉంటే కూల్ డ్రింక్స్ ని విచ్చలవిడిగా తాగితే.. అసలుకే మోసం వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి డ్రింక్స్ బదులు ఫ్రూట్స్ జ్యూస్ లు, మంచి ఆహారం తీసుకోవడం ఉత్తమం అని సలహా ఇస్తున్నారు.