(Photo Credits: Pixabay)

నారింజ పండ్లను రోజు ఒకటి తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.. మీరు ఎప్పుడైనా గమనించారా.. అయితే ఈ పండు కేవలం చలికాలంలో మాత్రమే విరివిగా లభిస్తుంది. నారింజ సిట్రస్ కుటంబానికి చెందినది.ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడంలోను సహాయపడుతుంది.అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నారింజలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఈ పండు లో విటమిన్ సి ఉండడం వలన వ్యాధికారక కారకాలతో పోరాడటానికి.. తెల్లరక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఎవరికైనా గాయాలు అయి..ఆ గాయాలు ఇన్పెక్షన్లు అయితే వాటి నుంచి పోరాడే సామర్థ్యం ఈ పండు యొక్క ముఖ్య లక్షణం.

భోజనం చేసాక కొన్ని సోంపు గింజలు తింటే ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో ఎప్పుడైనా తెలుసుకున్నారా...

నారింజలో పొటాషియం అనే విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కనుక రక్తపోటును నియంత్రించడంలోను.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ ఈ పండు ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. పొటాషియం శరీరంలో ఉండే సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలోను నారింజ సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నారింజలో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం అవుతుంది. కొల్లాజెన్ ఒక నిర్మాణమైన ప్రోటీన్. యాంటిఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ కొన్నిరకాలైన క్యాన్సర్ల నుండి రక్షణాత్మక ప్రభావాలు ఈ పండు లో ఉన్నాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

నారింజపండు ముఖ్యంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. నారింజలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లను కూడా నివారిస్తుంది. ఈ నారింజలో ఉండే సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.