మనకు అందుబాటులో ఉండే అనేక రకాల పండ్లలో బొప్పాయి పండు ఒకటి. వీటిని మనం ఏ సీజన్ లో అయినా తినవచ్చు. ఈ పండ్లు మనకు సంవత్సరమంతా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ బొప్పాయి పండ్లను తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపరు. కానీ ఈ బొప్పాయి పండ్లతో మనం అనేక రకాలైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ బొప్పాయి పండ్లను ప్రతి రోజు ఒక కప్పు మోతాదులో ఉండేవిధంగా చూసుకొని ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తినవచ్చు. భోజనం చేసిన అనంతరం ఒక గంట ఆగి ఆ పండ్ల ముక్కలను తినాలి. దీంతో అనేక రకాలైన లాభాలను పొందవచ్చు అని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..
బొప్పాయి పండ్లలో ఫైబర్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది.ఇది జీర్ణ సమస్యలు ఉండే వారికి ఈ పండ్లు తినడం వలన వాటినుంచి తగ్గించుకోవచ్చు. అలాగే తిన్న ఆహారం పూర్తిగా జీర్ణంచేస్తుంది. దీంతో అజీర్తి సమస్య నుంచి బయటపడవచ్చు. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు కూడా మన దగ్గరికి దరి చేరకుండా ఉంటాయి. ఎక్కువగా బొప్పాయి పండ్లలో ఐరన్ లభిస్తుంది. ఇది రక్తాని తయారు చేస్తుంది. దీంతో రక్తహీనత సమస్యతో భాదపడేవారికి ఈ పండు తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. బొప్పాయి పండ్లలో ఉండే పోషకాలు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
రోజుకు 12 గంటల పాటు కూర్చుని పనిచేస్తున్నారా, అయితే ఈ జబ్బులు మీ దగ్గరకు వచ్చినట్లే..
ఈ పండు తినడం వల్ల దగ్గు, జలుబుతో పాటు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఇలాంటి వ్యాధులు వచ్చిన వారు రోజు ఉదయం, సాయంత్రం ఒక్కో కప్పు చొప్పున బొప్పాయి పండ్ల ముక్కలను తినాలి. దీంతో ఆ వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే ప్లేట్‌లెట్స్ కూడా బాగా పెరుగుతాయి. బొప్పాయి పండ్లను తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఎక్కువ ఒబిసిటి ఉన్న వారు కూడా ఈ పండు తినడం వల్ల బరువు తగ్గించుకునే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.
ఈ పండ్లను రోజు ఒక కప్పు తినడం వల్ల శరీరంలోని కొవ్వు తేలికగా కరిగిపోతుంది. ఇంకా షుగర్ ఉన్న వారు ఈ పండ్లను తినడం వల్ల షుగర్ ఉండే చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఎక్కువగా ఈ పండ్లలో ఉండే పొటాషియం బీపిని తగ్గించే అవకాశం ఉందని నిపుణులు తెలియజేసారు. బొప్పాయి పండుతో హైబీపి కంట్రోల్ కి వస్తుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉండడానికి ఈ పండు యెుక్క ముఖ్య లక్షణం. ఇలా ప్రతిరోజు ఒక కప్పు లేదా రెండు కప్పుల బొప్పాయి పండ్ల ముక్కలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని తాజాగా నిపుణులు తెలియజేస్తున్నారు. కనుక ఈ పండ్లను రోజు తినాలి..ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.