Newdelhi, Aug 3: షుగర్ వ్యాధి (Diabetes) ఇప్పుడు అందర్నీ కలవరానికి గురి చేస్తుంది. అయితే, ఆహారం (Food) నెమ్మదిగా నమిలి.. తీరిగ్గా తినడం వల్ల డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆహారాన్ని వేగంగా తినేవారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వృద్ధి చెందే అవకాశాలు పెరుగుతాయని పరిశోధకులు తాజాగా గుర్తించారు. అంటే ఇది టైప్-2 మధుమేహానికి సూచికగా పరిగణిస్తారు.
మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి చందన.. సీఎం చంద్రబాబు అభినందనలు
ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇలా..
వివరంగా చెప్పాలంటే, శరీరంలోని కణాలు ఇన్సులిన్ కు సరైన రీతిలో ప్రతిస్పందించనపుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది మధుమేహానికి దారితీస్తుంది. అందువల్ల ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమలడం ద్వారా మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ ను క్రమబద్ధీకరించుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.