Newdelhi, June 22: మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్లు మనుషుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. మైక్రోప్లాస్టిక్ (Microplastics) రక్కసి మనిషి శరీరం అంతటా పాకిపోయింది. మొన్నటికి మొన్న పురుషుడి వృషణాల్లో, నిన్న వీర్యంలోనూ బయటపడ్డ మైక్రో ప్లాస్టిక్ రేణువులు తాజాగా పురుషాంగంలోని (Penises) కణజాలంలోనూ కనిపించాయి. ఈ మేరకు మియామీ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. గత ఆగస్టు, సెప్టెంబర్‌లో మొత్తం ఆరు నమూనాలను పరిశీలించగా, ఐదు నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ రేణువులను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు.
ఏం జరుగొచ్చు??
పురుషాంగం కణజాలంలో మైక్రోప్లాస్టిక్ ఉనికి కారణంగా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు కలుగొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, అంగస్తంభనలపై ప్రభావం ఏమేరకు ఉంటుందో తెలియాల్సి ఉన్నదని వెల్లడించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.