Newyork, June 22: అమెరికాలోని (America) హవాయి దీవుల్లో మాత్రమే కనిపించే అత్యంత అరుదైన పక్షిజాతులు (హనీక్రీపర్స్) అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. దోమకాటుతో (Mosquitoes Bite) వచ్చే మలేరియా వాటి ఉనికికి ప్రమాదంగా మారింది. మలేరియాను ఎదుర్కునే రోగనిరోధక శక్తి వీటికి లేకపోవడంతో 90 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో బాగా యోచించిన హవాయి రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో లక్షలాది మగదోమలను ఈ దీవుల్లో విడిచిపెడుతోంది.
ఎందుకంటే?
హనీక్రీపర్స్ పక్షిజాతిని రక్షించుకునేందుకు చర్యలు ప్రారంభించిన హవాయి రాష్ట్ర ప్రభుత్వం వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగదోమల ఉత్పత్తి ప్రారంభించింది. వాటితో కలిసిన ఆడదోమలు గుడ్లు పొదగలేవు. కాబట్టి క్రమంగా వాటి సంతతిని నివారించవచ్చన్నది ప్రభుత్వ యోచన. అలా హెలికాప్టర్లతో లక్షలాది మగదోమలను ఈ దీవుల్లో విడిచిపెడుతోంది.