Newdelhi, July 5: మారుతున్న ఆహారపుటలవాట్లు, జీవనశైలి కారణంగా ఊబకాయం (Obesity), మధుమేహం (Diabetes) పెను సమస్యగా మారింది. దీంతో ఒబెసిటీ, డయాబెటిస్ బాధితులు విరివిగా మందులు వాడుతున్నారు. అయితే, ఈ ఔషధాల వల్ల ‘నాన్-ఆర్టెరిటిక్ ఆంటీరియర్ ఇషెమిక్ ఆప్టిక్ న్యూరోపతి’ అనే అరుదైన కంటి సమస్య (Blindness) వచ్చే ముప్పు ఏడు రెట్లు ఎక్కువ ఉందని తాజాగా వెల్లడైంది. అమెరికాలోని మసాచుసెట్స్ ఐ అండ్ ఇయర్ హాస్పిటల్ పరిశోధకుల బృందం చేసిన ఈ అధ్యయనంలో తేలింది.
Weight-loss jabs may be linked to condition that can cause blindness, study finds https://t.co/In58vuLwjV pic.twitter.com/jA1OUaWKnH
— Guardian World (@guardianworld) July 3, 2024
ప్రమాదం ఇలా..
మధుమేహం ఉన్న వారికి ఇన్సులిన్ స్థాయిలను పెంచేందుకు, ఊబకాయంతో బాధపడుతున్న వారికి బరువు తగ్గేందుకు (Weight Loss) గానూ ఒజెంపిక్, విగోవి వంటి ఔషధాలను ఇస్తున్నారు. అయితే, సెమాగ్లుటైడ్ అనే ప్రొటీన్ ఉన్న ఈ మందులు వాడే ఊబకాయ బాధితులకు మిగతా వారి కంటే ‘నాన్-ఆర్టెరిటిక్ ఆంటీరియర్ ఇషెమిక్ ఆప్టిక్ న్యూరోపతి’ సమస్య వచ్చే అవకాశం ఏడు రెట్లు ఎక్కువ ఉందని పరిశోధకులు గుర్తించారు. మధుమేహ బాధితులకు ఈ ముప్పు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల హఠాత్తుగా ఒక కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు.