Tirupati Stampede (photo-ANI)

Tirupati, Jan 9: ఏపీలోని తిరుపతిలో (Tirupati) జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది బాధాకర ఘటన అని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.

తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తిరుపతిలో నేడు చంద్రబాబు పర్యటన.. రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించనున్న సీఎం

తీవ్రంగా కలచివేసింది

తిరుమల  వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు మరణించిన వార్త తీవ్రంగా కలచివేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తొక్కిసలాటలో భక్తుల మృతి బాధాకరమని పవన్ కళ్యాన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

తిరుపతి తొక్కిసలాటలో నాలుగుకు చేరిన మృతుల సంఖ్య, వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో తీవ్ర అపశృతి, వీడియోలు ఇవిగో..