Char Dham Yatra of Uttarakhand (File Image)

Kedarnath, May 9: కేదార్‌నాథ్ (Kedarnath) ఆల‌య తలుపులు రేపు తెరుచుకోనున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ తలుపులు (Doors of Kedarnath Dham) మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు బద్రీనాథ్‌-కేదార్‌నాథ్ ఆల‌య క‌మిటీ చైర్మెన్ అజేంద్ర అజ‌య్ (Ajendra Ajay) తెలిపారు.

ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయాన్ని 40 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు.ఈ యాత్ర చేసేందుకు లక్షలాది మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కొందరు భక్తులు ఇప్పటికే ఉత్తరాఖండ్‌ చేరుకున్నారు.

అయితే ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షాలకు తోడు వడగళ్ల వానలు కురుస్తున్నాయి. అల్మోరా-సోమేశ్వర్ ప్రాంతంలో పిడుగులు పడుతున్నాయి. అల్మోరా-కౌసాని హైవేపై కొండచరియలు విరిగిపడటంతో గత 12 గంటలుగా ఈ రహదారిని మూసివేశారు. మారుతున్న వాతావరణం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండ చరియలు, 12 మంది గల్లంతు, హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు

ఉత్తరాఖండ్‌లోని అల్మోరాతో పాటు, బాగేశ్వర్‌లో ఆకాశం మేఘావృతమైంది. ఉత్తరకాశీలోని పురోలాలో భారీ వడగళ్ల వాన కురిసింది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల వరద ముప్పు ఏర్పడింది. మే 13 వరకు ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది.

Here's Video

ఇటువంటి వర్షాల సమయంలో ట్రెక్కింగ్‌ చేయవద్దని టూరిస్టులకు వాతావరణశాఖ తెలిపింది. తాజాగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రుతుపవన విపత్తుల నివారణ, చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra 2024) నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు.  వీడియో ఇదిగో, భారీ వరదలకు నదిలో కొట్టుకుపోతున్న ఆర్టీసీ బస్సు, భయంతో నదిలోకి దూకేసిన ప్రయాణికులు

పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్‌ ఆలయం ఒకటి. చార్‌ధామ్‌ యాత్రలో కేదార్ నాథ్‌ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఏటా శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు.