![](https://test1.latestly.com/uploads/images/2025/02/1-780921394.jpg?width=380&height=214)
Newdelhi, Feb 10: యూపీలోని (UP) ప్రయాగరాజ్ లో వైభవంగా జరుగుతున్న మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తాజాగా ఈ పవిత్ర కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం అక్కడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. రాష్ట్రపతికి తీర్థ ప్రసాదాలు అందించి పూజారులు ఆశీర్వదించారు. రాష్ట్రపతి వెంట యూపీ ముఖ్యమంత్రి యోగీ కూడా ఉన్నారు.
మహాకుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు (వీడియో)
Here's Video:
కుంభమేళాలోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము https://t.co/l1MNtcGE1o pic.twitter.com/7D9Dzc6LtG
— BIG TV Breaking News (@bigtvtelugu) February 10, 2025
ఎంతో అద్భుతం
12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా లక్షలాదిగా పాల్గొంటున్నారు. కాగా, మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి సందర్భంగా ‘అమృత స్నానాలు’ ముగిసినప్పటికీ భక్తులు ఇప్పటికీ మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితర ప్రముఖులు పుణ్యస్నానం చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు కూడా సతీసమేతంగా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడం తెలిసిందే.
హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 10 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది (వీడియో)