Ayodhya, Jan 19: జాతి జనులు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్న అయోధ్యలో (Ayodhya) ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అయోధ్య రామాలయ (Ayodhya Temple) గర్భగుడిలోకి రామ్ లల్లా (Ram Lalla) విగ్రహాన్ని చేర్చారు. తెల్లవారుజామునే జై శ్రీరామ్ నినాదాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు. అనంతరం బాల రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహం తొలి ఫొటో కూడా బయటకొచ్చింది. విగ్రహం ముఖాన్ని పరదాతో కప్పి ఉంచినప్పటికీ మిగతా రూపు కనిపించింది. నిలబడిన ఆకారంలో ఐదేళ్ల పిల్లవాడిగా అయోధ్య రామయ్య కనిపించాడు. నల్లరాతితో తయారు చేసిన ఈ విగ్రహాన్ని మైసూర్‌కు చెందిన కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కాడు.
#RamLalla idol's first photo inside #Ayodhya temple's sanctum sanctorum revealedhttps://t.co/avPjxPNcv3
— Hindustan Times (@htTweets) January 19, 2024
23 నుంచి భక్తులకు..
జనవరి 22న 'ప్రాణప్రతిష్ఠ' కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. మరుసటి రోజు అంటే జనవరి 23 నుంచి భక్తులు ‘అయోధ్య రాముడు’ని దర్శించుకోవచ్చు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 11,000 మంది అతిథులను ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది.