Tirumala, Nov 23: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గమనిక. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ రేపు (నవంబరు 24) విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ఈ టికెట్లను రేపు 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిబ్రవరి కోటాకు సంబంధించి వసతి గదుల కోటా టికెట్లను కూడా రేపు విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలోని వసతి గదుల టికెట్లను రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. టికెట్ల బుకింగ్ కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని టీటీడీ పేర్కొంది.
అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఫిక్స్.. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కార్యక్రమం
ఇక, వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న రథసప్తమి నాడు శ్రీవారి సన్నిధిలో సేవలు అందించే వాలంటీర్ల కోసం స్లాట్లను ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ శ్రీవారి సేవా స్లాట్లను 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు మాత్రమే బుక్ చేసుకునే వీలుంటుంది. జనవరి, ఫిబ్రవరి మాసాలకు సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవల్లో పాల్గొనే వాలంటీర్ల కోసం స్లాట్లను నవంబరు 27 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పరాకమణి సేవలో పాల్గొనే వాలంటీర్లకు ఆన్ లైన్ లో స్లాట్లను కేటాయించనున్నారు.