Tirumala, Nov 23: తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునే వికలాంగులైన భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు (senior citizens on Nov 24) వీలుగా డిసెంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను (TTD to release December’s quota) ఈనెల 24 న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఆన్‌లైన్‌లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.
ఇక టీటీడీ లో పోగయిన వినియోగించిన గోనె సంచులు , టిన్నులను డిసెంబరు 1, 2 తేదీల్లో టెండర్ కమ్ వేలం వేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో ఉన్న మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో టెండర్ కమ్ వేలం జరుగనుందని, ఆసక్తి గలవారు రూ.590లు చెల్లించి టెండరు షెడ్యూల్ పొందవచ్చని సూచించారు.
ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 69,587 మంది భక్తులు దర్శించుకోగా 28,645 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చిందని వెల్లడించారు.