తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 78,064 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 33,869 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 10 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారంటే కలియుగం అంతం అయినట్లే, కృష్ణుడు గరుడ భగవానుడికి కలియుగం అంతం గురించి చెప్పిన సంకేతాలు ఏమిటంటే..
వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వలన, వారు దర్శనానికి సుమారు ౩0 నుంచి 40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వుంది. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకుగాను, జూన్ 30వ తేదీ వరకు శుక్ర శని, ఆది వారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేయబడినది. ఇందుకుగాను, సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ మార్పును గమనించి భక్తులు టి.టి.డికి సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేయడమైనదని టీటీడీ తెలిపింది.