Liquid Nitrogen Paan (Credits: X)

Bengaluru, May 21: బెంగళూరులో (Bengaluru) దారుణం జరిగింది. ‘స్మోకీ పాన్‌’ను (లిక్విడ్‌ నైట్రోజన్‌ పాన్‌) (Liquid Nitrogen Paan) తిన్న పన్నెండేళ్ల బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు షాక్ కి గురయ్యారు. కారణం ఆమె కడుపులో రంధ్రం ఏర్పడటమే. దీంతో ఆమెకు గ్యాస్ట్రో సర్జరీ చేయవలసి వచ్చింది.

తెలంగాణ రైతన్నలకు శుభవార్త.. వచ్చే నెల 5 - 11 మధ్య తెలంగాణలోకి రుతుపవనాల ప్రవేశం.. వాతావరణ శాస్త్రవేత్తల వెల్లడి

అసలేం జరిగిందంటే..

లిక్విడ్‌ నైట్రోజన్‌ తో తయారు చేసిన స్మోకీ పాన్‌ ను తిన్నవారు నోటి నుంచి పొగలను ఊదుతుండటాన్ని సదరు బాలిక  గమనించింది. తాను కూడా అలాగే చేయాలనుకుంది. స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాల్స్‌ లో విస్తృతంగా లభిస్తున్న స్మోకీ పాన్‌ ను కొనుక్కుని, తింది. వెంటనే అస్వస్థతకు గురైంది. విపరీతంగా కడుపు నొప్పితో బాధపడటంతో ఆమెను దవాఖానకు తరలించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌, తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు ఇవిగో..