Newdelhi, Dec 3: కేరళలో (Kerala) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థులు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. దీంతో ఐదుగురు విద్యార్థులు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం రాత్రి అలప్పుజ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వందనం మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు సోమవారం రాత్రి గురువాయుర్ నుంచి కాయంకులం బయలుదేరారు. మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుగా మారింది.
Here's Video:
ആലപ്പുഴ കളര്കോടുണ്ടായ അപകടത്തിന്റെ സിസിടിവി ദൃശ്യം പുറത്ത്
ആലപ്പുഴ: അഞ്ച് പേര് മരിച്ച കളര്കോട് അപകടത്തിന്റെ സിസിടിവി ദൃശ്യങ്ങള് പുറത്ത്. എതിര്ദിശയിലെത്തിയ കാര് അമിതവേഗത്തിലെത്തി ബസ്സിലിടിക്കുകയായിരുന്ന എന്ന് വ്യക്തമാക്കുന്ന ദൃശ്യമാണിത്.#alapuzha #ksrtc #Accident #Kerala pic.twitter.com/towh7vryit
— Thejas News (@newsthejas) December 3, 2024
అందుకే??
వర్షం, రాత్రి వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. విద్యార్థులంతా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.