Newdelhi, July 30: దేశంలో పాము కాటు (Snake Bites in India) మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పాము కాటు వల్ల భారత్ లో ఏటా 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ (BJP) ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం లోక్ సభలో వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక పాము కాట్లు కూడా మన దగ్గరే రికార్డు అవుతున్నట్టు పేర్కొన్నారు. దేశంలో ఏటా 30-40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దేశంలో పాము కాట్లు పెరుగడానికి గల కారణాలను కూడా ఎంపీ వెల్లడించారు.
Across India, 30 to 40 lakh people are bitten by snakes and 50,000 people die, which is the highest in the world: @RajivPratapRudy https://t.co/KawO2WaaQY
— The Telegraph (@ttindia) July 29, 2024
ఎందుకంటే?
వాతావరణ మార్పులు పాముకాట్లపై ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్ దాటి పెరిగితే ఈ ఘటనలు పెరుగుతాయని తెలిపారు.