Stampede in Bihar Temple (Credits: X)

Patna, Aug 12: బీహార్‌ లో (Bihar) జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌ లోని బాబా సిద్ధనాథ్‌ ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఆలయం వద్ద ఉన్న కొండపైకి భక్తులు ఎక్కుతుండగా మెట్లపై తొక్కిసలాట జరిగి గందరగోళ వాతావరణం నెలకొన్నది. ఈ  తొక్కిసలాటలో (Stampede) ఏడుగురు భక్తులు మృతిచెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. మరో 50 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.  క్షతగాత్రులను సమీపదవాఖానకు తరలించారు.

మేము విడిపోవడం కన్నా చనిపోవడమే మేలు, బీహార్‌లో లవర్స్ హైడ్రామా వీడియో సోషల్ మీడియాలో వైరల్

అధికారులు అలా.. భక్తులు ఇలా..

ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. అయితే భక్తులను నియంత్రించడానికి ఆలయ సిబ్బంది లాఠీచార్జి చేయడంతోనే ఆ ఘటన చోటుచేసుకున్నట్లు భక్తులు ఆరోపిస్తుండటం గమనార్హం.

పాట్నాను ముంచెత్తిన భారీ వర్షాలు, బీహార్ అసెంబ్లీ ప్రాంగణం, మంత్రుల ఇళ్లు జలమయం, పరిస్థితిని సమీక్షించిన సీఎం నితీష్ కుమార్