Kiraak Kidnapper: మహానుభావుడు! కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేశాడు, ఆ తర్వాత ఆ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చెప్పమని మళ్లీ అతడ్నే రిక్వెస్ట్ చేశాడు.
Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

ఆసియాలో అత్యంత సంపన్నుల్లో హాంకాంగ్ (Hong Kong) కు చెందిన లీ-కా షింగ్ఒకరు. ఈయన ఏడాది సంపాదన మన భారత కరెన్సీ ప్రకారం 3 లక్షల కోట్ల వరకు ఉంటుంది. మనదేశానికి చెందిన అపర కుభేరుడు ముఖేష్ అంబానీ సంపాదన కూడా దాదాపు ఇంతే 3 లక్షల 38 వేల కోట్లుగా ఉంది. అంటే ఒక్కరోజుకి వీరి సంపాదన మన కరెన్సీ ప్రకారం రూ. 300 కోట్ల వరకు ఉంటుంది.

అయితే అసలు విషయానికొస్తే, ఈ లీ-కా షింగ్ కొడుకు విక్టర్ లీ-జర్ క్యు ను కొన్నేళ్ల కిందట చెవుంగ్-కెయుంగ్ అలియాస్ బిగ్ స్పెండర్ అనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఆయన ఇంటికి వచ్చే దారిలో అడ్డగించి కిడ్నాప్ చేశాడు. కొడుకుని విడిపించుకోవాలంటే తనకు అర్జంటుగా రూ. 2వేల కోట్లు (మన కరెన్సీ ప్రకారం) ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. చివరకు రూ. వెయ్యి కోట్లకు డీల్ కుదుర్చుకొని ఆ తర్వాత రోజు ఉదయమే విక్టర్ లీను వదిలిపెట్టాడు.

అయితే ఇంతవరకూ చాప్టర్ క్లోజ్ అయిందనుకుంటే ఆ గ్యాంగ్‌స్టర్ నుంచి మళ్లీ ఫోన్ కాల్ వచ్చింది. అందుకు కంగారుపడ్డ లీ- కా షింగ్ నువ్వు జీవితాంతం రాజులాగా బ్రతికేంత డబ్బు నీకు ఇచ్చాను, ఆ డబ్బు నువ్వు సరైన మార్గంలో ఉపయోగిస్తే అంతకుమించి సంపాదించేందుకు అవకాశం ఉంది. ఇప్పటికైనా సమాజంలో మంచిగా బ్రతుకు, ఇంకా ఏం కావాలి నీకు అని ఆ గ్యాంగ్‌స్టర్‌ను అడిగితే. అందుకు ఆ గ్యాంగ్‌స్టర్, మిస్టర్ లీ.. నేనొక పెద్ద జూదగాడిని మీరు పంపించిన డబ్బు మొత్తం దాదాపు జూదంలో కోల్పోయాను ఇంకా కొద్దిమొత్తం మాత్రమే మిగిలింది. మీరు మంచి బిజినెస్ మ్యాన్ కదా, ఈ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, లాభాలు రావాలంటే ఏం చేయాలి అని తిరిగి లీని ప్రశ్నించాడట.

దానికి లీ.. మంచిగా బ్రతుకు అని మాత్రమే నేను సలహా ఇవ్వగలను, డబ్బు ఇచ్చాను, అది ఎలా ఉపయోగించుకోవాలి అనేది నీచేతుల్లోనే ఉంది, ఇంకా ఆపేయ్ లేకపోతే నీ కథ దుఖాంతం అవుతుందని చెప్పాడట. ఆనాటి అనుభవాలను లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

కాగా, ఆ గ్యాంగ్‌స్టర్ మరో ఇద్దరు హైప్రొఫైల్స్ గల వ్యక్తులను కిడ్నాప్ చేసి ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు. కోర్ట్ మరణశిక్ష విధించటంతో 40 ఏళ్లకే ఆ గ్యాంగ్‌స్టర్ కథ ముగిసింది.