Patna, Feb 21: ఈ మధ్య కాలంలో చాలా చిన్న కారణాలతో పెండ్లి వేదికల వద్దనే వివాహాలు రద్దవుతున్నాయి. ఇలాంటి తరహా సంఘటన ఇటీవల బీహార్లో జరిగింది. తన కుటుంబ సభ్యులకు విందు ఆలస్యమైనందుకు పెళ్లి పీఠల మీద కూర్చోవాల్సిన వరుడు ఏకంగా పెండ్లిని (Angry Groom Refuses to Get Married) తిరస్కరించాడు. కోపంతో పెండ్లి వేదిక వద్ద నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆ పెండ్లి నిలిచిపోయింది. బీహార్‌లోని పూర్ణియ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
స్థానికుల వివరాల ప్రకారం.. మోహని పంచాయతీలోని బటౌనా గ్రామంలో ఇటీవల ఒక వివాహ వేడుకకు అంతా సిద్ధమైంది. అమరి కుక్రాన్ ప్రాంతానికి చెందిన పెండ్లి కుమారుడు రాజ్‌కుమార్ ఓరాన్ తన బంధు మిత్రులతో కలిసి ఊరేగింపుగా పెండ్లి వేదికకు చేరుకున్నాడు. అయితే పెండ్లి హాడావుడిలో పడిన వధువు బంధువులు, వరుడి కుటుంబ సభ్యుల భోజనాల గురించి (Delay in being served food) పట్టించుకోలేదు. దీంతో విందు ఆలస్యం కావడంపై పెండ్లి కుమారుడి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెండ్లిని కొనసాగించేందుకు ఆయన నిరాకరించాడు. స్థానికులు, పంచాయతీ పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.
మరోవైపు వరుడు ఆగ్రహంతో పెండ్లి వేదిక వద్ద నుంచి ( refuses to get married) వెళ్లిపోయాడు. దీంతో ఆ పెండ్లి రద్దయ్యింది. ఈ నేపథ్యంలో వధువు కుటుంబ సభ్యుల నుంచి స్వీకరించిన కట్నకానుకలు, విందు ఖర్చులను వధువు తండ్రి చెల్లించాడు. అయితే పెండ్లి రద్దు కావడంపై వరుడు, ఆయన తండ్రిపై వధువు తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతేడాది కూడా ఇదే తరహాలో సుకిందలోని ఓ వరుడు పెళ్లి పనులు ప్రారంభించేందుకు కొద్ది క్షణాల ముందు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. 27 ఏళ్ల వరుడు, రమాకాంత్ పాత్రగా గుర్తించబడ్డాడు, వధువు కుటుంబం విందులో తన బంధువుల మటన్‌ను వడ్డించడంలో విఫలమవడంతో కలత చెందాడు. ఇంటికి వచ్చేలోపు మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వెళ్లాడు.