TS police Logo

ఈ మధ్య కాలంలో ఫేస్ బుక్ లో చాలా మంది ఫేక్ అకౌంట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. కొందరయితే ఏకంగా వేరే వాళ్ల ప్రాఫైల్స్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారు. ఈ మోసాలపై పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే (Beware Of Frauds) ఉన్నారు. తాజాగా సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ వింగ్‌ పోలీసులు తాజాగా ట్విటర్‌లో ఫన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ పోస్ట్‌ ( cyberabad police Tweet Athadu Movie meme) ఒకటి వేశారు. తివిక్రమ్‌-మహేష్‌ బాబు ‘అతడు’లోని ఓ ఫేమస్‌ డైలాగ్‌ మీమ్‌ను వాడేశారు. ‘ఒక అమ్మాయి తనకు ఫ్రెండ్‌రిక్వెస్ట్‌ పంపి తెగ ఛాటింగ్‌ చేస్తుంద’ని కొడుకు మురిసిపోతుంటే.. ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదు రా’ అంటూ తండ్రి ఆ కొడుక్కి షాక్‌ ఇస్తాడు.

ఈ మీమ్ ద్వారా ఫేక్‌ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌ పట్ల అప్రమత్తంగా (Beware of Fake Facebook profile fraud) ఉండాలని ప్రజలకు సైబరాబాద్ పోలీసులు సందేశం ఇచ్చారు . పనిలో పనిగా నటుడు బ్రహ్మాజీని సైతం ఈ మీమ్ కి సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ వింగ్‌ పోలీసులు ట్యాగ్‌ చేసి పడేశారు. సాధారణంగానే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బ్రహ్మాజీ.. ఆ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు కూడా. ఇక సోషల్‌ మీడియా వాడకంలో పోలీసులది డిఫరెంట్‌ పంథా. కరెక్ట్‌ టైమింగ్‌, రైమింగ్‌తో ప్రజల్ని అప్రమత్తం చేయడం, అవగాహన కల్పించడం వాళ్ల విధిగా మారింది.

Here's Cyber Crimes Wing Cyberabad Tweet

ఈ క్రమంలో నవ్వులు పూయించే మీమ్స్‌ను సైతం వాడేస్తున్నారు. కేరళ, ముంబై పోలీసుల్లాగే.. తెలంగాణ పోలీసుల సోషల్‌ మీడియా వింగ్‌ సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటూ మోసాల నుంచి ప్రజలను రక్షించే పనిలో యాక్టివ్ గా ఉణ్నారు.