Fact Check: వైరల్ అవుతున్న ఈ టాటా లింక్ క్లిక్ చేయకండి, అలర్ట్ చేసిన టాటా కంపెనీ, ఎవరైనా నష్టపోతే మాకు సంబంధం లేదంటూ ట్వీట్
Tata 150th Anniversary Scam (Photo-Taitter/tata group)

ఈ మధ్య కాలంలో అనేక స్కాములు లింకులు ద్వారా జరుగుతున్నాయి. వాట్సాప్ ద్వారా యూజర్లకు ఓ లింక్ పంపి దాన్ని క్లిక్ చేయమని అడుగుతారు. కంపెనీ వార్షికోత్సవమనో లేకుంటే ఆఫర్ అనో ఈ లింక్ పంపిస్తుంటారు. తాజాగా గత కొద్ది రోజుల నుంచి టాటా కంపెనీకి సంబంధించి ఒక పోస్టు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది. వైరల్ అవుతున్న పోస్టులో టాటా గ్రూప్ 150వ వార్షికోత్సవం (BEWARE of Tata 150th Anniversary Scam) సందర్భంగా టాటా నెక్సాన్ కారును గెలుచుకోవడానికి ఈ పోస్టు క్లిక్ చేయండి (Tata Nexon Bumper Prize) అని ఉంటుంది.

అయితే, ఈ మధ్య కాలంలో ఇటువంటి ఆన్ లైన్ స్కామ్ లు చాలా సాధారణం అయ్యాయి. అందుకే, ఇటువంటి విషయాల గురించి ప్రజలు తెలుసుకోవాలి. ఒకవేల మీరు గనుక ఇటువంటి లింక్స్ క్లిక్ చేస్తే మీ ఆర్థిక వివరాలతో పాటు వ్యక్తిగత సమాచారం హ్యాకర్లు హ్యాక్ చేస్తారు. హ్యాకర్లు నిరంతరం మీ డబ్బును దోచుకోవడానికి ఇలాంటి స్కామ్ లింక్స్ పంపిస్తారు అనే విషయం గుర్తుంచుకోవాలి.

కేంద్రం మీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రికార్డు చేస్తుందనే వార్త అబద్దం, ఆ వాట్సాప్ మెసేజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకండి, వార్త నిజమా? కాదా? చెక్​ చేసుకొని షేర్​ చేయాలని కోరిన పీఐబీ ఫ్యాక్ట్​చెక్​

ఇప్పుడు వైరల్ అవుతున్న టాటా గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే, అందులో మిమ్మల్ని సరళమైన ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత చివర్లో బహుమతిని తెరవమని అడుగుతారు. మీరు మూడుసార్లు ప్రయత్నించడానికి ఛాన్స్ ఇస్తారు. యూజర్లు సాధారణంగా ఈ ఉచ్చులో పడతారు. ఉచితంగా వస్తున్నాయని బహుమతుల కోసం ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటారు. అయితే, మీ వ్యక్తిగత వివరాలను పొందే సామర్ధ్యం ఉన్న వైరస్ లింక్ మీ పరికరంలో హ్యాకర్లు ఇన్ స్టాల్ చేస్తారు.

Here's Tata Group Tweet

అందుకే ఇటువంటి లింక్స్, పోస్టుల విషయంలో చాలా జాగ్రత్తగా నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా టాటా లింక్ పై కంపెనీ కూడా అప్రమత్తం చేసింది. ట్విట్టర్లో ఈ లింక్ పై ట్వీట్ చేసింది. ఇది ఫేక్ అని ఎవరూ దీని ఉచ్చులో పడవద్దని కోరంది.