Viral: ఐదేళ్ల నుంచి పిల్ల చిక్కడం లేదు, తట్టుకోలేక వధువు కావాలని రోడ్డు మీద పోస్టర్లు వేయించాడు, తమిళనాడులో వైరల్ అవుతున్న పెళ్లి బ్యానర్లు
Bride Wanted Poster

దేశంలో పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. 35 కాదు 40 ఏళ్లు వచ్చినా వారికి అమ్మాయి దొరటంలేదు. కనీసం బంధువుల అమ్మాయిలను చేసుకుందామన్నా కుదరటంలేదు.వధువు కోసం మ్యారేజీ బ్రోకర్లను సంప్రదించడం, మాట్రిమోనీ సైట్లు, పేపర్‌లో ప్రకటనల ద్వారా తగిన అమ్మాయిని వెతుక్కోవడం చేస్తుంటారు చాలా మంది. కానీ తమిళనాడులో ఓ యువకుడి ఈ తతంగం అంతా ఎందుకు అనుకున్నాడో గానీ ఏకంగా చౌరస్తాల్లో 'నాకు వధువు కావలెను'అంటూ బ్యానర్ కట్టి మరీ పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు.

తమిళనాడులోని విల్లాపురానికి చెందిన ఎమ్మెస్‌ జగన్‌ అనే ఇంజనీర్ యువకుడు మాత్రం 'పేరు: MS జగన్‌. వయస్సు: 27 ఏళ్లు. జీతం నెలకు 40వేలు. నాకు వధువు కావలెను' అంటూ మధురై అంతటా రోడ్ల కూడళ్లలో ఇలా బ్యానర్లు (Bride Wanted Poster) కట్టి మరీ పిల్ల కోసం వెతుక్కుంటున్నాడు. పోస్టర్లలో జగన్ ఫోటోతో పాటు కులం, జీతం, వృత్తి, చిరునామా, భూమి కూడా ఉందనే వివరాలు ఉన్నాయి.

అది లేదని.. ప్రియురాలి కోసం లింగ మార్పిడి చేసుకున్న యువతి, టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేసిన వైద్యులు, ప్రక్రియ పూర్తి కావడానికి 18నెలల సమయం

ఈ వింత పనితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జగన్ మాట్లాడుతూ..నేను ఐదేళ్లుగా వధువు కోసం వెతుకుతున్నాను..కానీ ఎక్కడా పిల్ల కుదరలేదు. దీంతో ఈ పోస్టర్ డిజైన్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. నేను చాలా పోస్టర్లు డిజైన్ చేశాను. కానీ నా పెళ్లి కోసం (I want a bride) ఇలా వధువు కోసం పోస్టర్ ను డిజైన్ చేసి చౌరస్తాల్లో కట్టాను అని తెలిపాడు. అది చూసి తనకు తెలిసినవారు..బంధువులు..స్నేహితులు ఫోన్లు చేసి ఇదేం పనిరా అని హేళన చేస్తున్నారని..కానీ అవేమీ నేను పట్టించుకోనని ఓ అమ్మాయి దొరకితే అదే భాగ్యం అని వివాహం చేసుకుంటాను అని చెబుతున్నాడీ పెళ్లికాని ప్రసాదు.